మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల(maa elections 2021) సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్(prakash raj panel) చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్(maa election officer krishna mohan) స్పందించారు. 'మా' ఎన్నికల నిర్వహణతోనే తన బాధ్యత పూర్తయ్యిందని, ఆ తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగిన రోజున, కౌంటింగ్ జరిగిన సమయంలో కానీ తనకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అప్పుడే ఫిర్యాదు చేసుంటే చర్యలు తీసుకునేవాడినన్నారు. ఎన్నికల నాటి సీసీ టీవీ ఫుటేజీ ఇచ్చేందుకు తనకి అధికారం లేదని తెలిపారు.
"తొలిసారి ఆయన ఫుటేజీ అడిగినప్పుడు పరిశీలించి చెప్తాను అన్నాను. కానీ, ఇస్తానని అనలేదు" అని అన్నారు కృష్ణమోహన్. న్యాయస్థానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని పేర్కొన్నారు. ఇకపై అధికారమంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందన్నారు. ఎన్నికల్లో వైకాపా నాయకుల జోక్యముందని ప్రకాశ్‌రాజ్(prakash raj panel) చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు.
'మా' ఎన్నికల్లో(maa elections 2021) అవకతవకలు జరిగాయంటూ కొన్ని రోజుల క్రితం ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్(prakash raj panel) లేఖ రాశారు. సీసీ ఫుటేజీ కావాలని అందులో కోరారు. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తూ మరోసారి సీసీ ఫుటేజీ ఇవ్వమని ట్విట్టర్ ద్వారా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను ప్రకాశ్‌రాజ్ కోరారు.