ETV Bharat / sitara

'లవ్​స్టోరీ.. అమ్మాయిలు తప్పకుండా చూడాలి' - aamir khan naga chaitanya movie

'లవ్​స్టోరీ'.. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాల్సిన సినిమా అని అన్నారు హీరోహీరోయిన్​ నాగచైతన్య, సాయిపల్లవి. ఈ చిత్రం హిట్​ అవ్వాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

lovestory
లవ్​స్టోరీ
author img

By

Published : Sep 24, 2021, 9:13 PM IST

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్​స్టోరీ'. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(సెప్టెంబరు 24) థియేటర్లలో విడుదలై సూపర్​హిట్​ రెస్పాన్స్​ సంపాదించుకుంది. ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్​ మీట్​ నిర్వహించింది. కేక్​ కట్​ చేసి బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చైతూ, పల్లవి, శేఖర్​.. సినిమా హిట్​ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు.

ఆలస్యమైనా కంటెంట్​ నమ్మి, థియేటర్లలో విడుదల చేసినట్లు తెలిపారు చైతూ. "ప్రేక్షకులు కుటుంబాలతో కలిసి థియేటర్​కు రావడం ఆనందంగా ఉంది. క్రెడిట్​ అంతా డైరెక్షన్​ టీమ్​, సహనటులకు దక్కుతుంది. చిత్రబృందానికి ధన్యవాదాలు. ఇది థియేటర్​లో చూడాల్సిన సినిమా. అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిఒక్కరూ కనెక్ట్​ అవుతారు" అని చైతూ అన్నారు.

లవ్​స్టోరీ సక్సెస్​ మీట్​

"సినిమా విజయవంతం అవ్వాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలి. ముఖ్యంగా అమ్మాయిలు చూడాల్సిన చిత్రం. ఇందులో ముఖ్యమైన కథ ఉంది. ఈ పాత్ర ఇచ్చినందుకు, ఇలాంటి సబ్జెక్ట్​ తీసుకున్నందుకు శేఖర్​కు థ్యాంక్స్​"

-సాయిపల్లవి, హీరోయిన్​

"సినిమా విజయవంతం కావాలని ట్వీట్లు చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. చిరంజీవి, ఆమీర్​ ఖాన్​కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు."

-శేఖర్​ కమ్ముల, దర్శకుడు

శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పవన్.సీహెచ్​ సంగీతమందించగా, పి.రామ్మోహన్, నారాయణ్​దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

'అది నా వ్యక్తిగతం.. సినిమాతో ముడిపెట్టొద్దు'

Sai Pallavi: 'రీమేక్‌ అని నో చెప్పలేదు.. ఆ భయంతోనే చెప్పా'

'సాయి పల్లవితో చేసేందుకు చాలా టేక్​లు తీసుకున్నా'

Love Story Review: 'లవ్​స్టోరి' మూవీ సోషల్​ రివ్యూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.