శ్వాస సంబంధిత సమస్యలతో గత నెలలో ఆసుపత్రిలో చేరిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్.. 28 రోజుల తర్వాత డిశ్చార్చ్ అయ్యారు. ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇన్స్టా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"శ్వాస సమస్యల కారణంగా గత 28 రోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉన్నా. పూర్తి ఆరోగ్యం పొందిన తర్వాతే డిశ్చార్చ్ అవ్వమని డాక్టర్లు చెప్పారు. అందుకే ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు ఇంటికొచ్చా. వారందరికీ ధన్యవాదాలు. నన్ను చాలా చక్కగా చూసుకున్న డాకర్లకు కృతజ్ఞతలు" -లతా మంగేష్కర్, గాయని
పలు భారతీయ భాషల్లో లతా మంగేష్కర్ వేల సంఖ్యలో పాటలు పాడారు. 2001లో కేంద్ర ప్రభుత్వం ఆమెను భారతరత్నతో సత్కరించింది.
ఇది చదవండి: మహీ... రిటైర్మెంట్ ఆలోచన రానీయొద్దు: లతా మంగేష్కర్