ETV Bharat / sitara

మరోసారి 'జాదూ' చేయనున్న హృతిక్ రోషన్ - క్రిష్ 4లో జాదూ

'క్రిష్​' సినిమాతో బాలీవుడ్​ సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ నుంచి 'క్రిష్ 4 ' తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హల్​చల్ చేస్తోంది.

క్రిష్ 4
క్రిష్ 4
author img

By

Published : Jul 9, 2020, 1:11 PM IST

బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. 'క్రిష్'‌ సీక్వెల్స్‌లో నాలుగో సినిమా 'క్రిష్‌ 4' కోసం ఆశగా ఉన్నారు. 2003లో వచ్చిన 'కోయి మిల్‌ గయా', తర్వాత 2006లో 'క్రిష్', 2013లో వచ్చిన 'క్రిష్‌ 3' భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో 'క్రిష్‌ 4' చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. 'క్రిష్‌ 4'ను ఈ ఏడాది క్రిస్మస్​కే విడుదల చేయాలని తొలుత చిత్రబృందం భావించింది.

అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. ఫలితంగా సినిమా విడుదలపై అభిమానుల్లో అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్​కు తీపి కబురు చెప్పింది చిత్రబృందం. 'కోయి మిల్‌ గయా'లో సందడి చేసిన క్రిష్‌ స్నేహితుడు 'జాదూ' మరింత అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిపింది. జాదు సాయంతో క్రిష్‌ తండ్రి, శాస్త్రవేత్త అయిన రోహిత్‌ మెహ్రాను కాపాడుకునే అంశంతో 'క్రిష్‌ 4' సినిమా రాబోతుందట. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.