ETV Bharat / sitara

దుమ్మురేపుతున్న 'కేజీఎఫ్​ 2' టీజర్.. మరో రికార్డు - యశ్ కేజీఎఫ్ 2 టీజర్0

య‌శ్‌-ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. తాజాగా ఈ సినిమా టీజర్ యూట్యూబ్​లో మరో రికార్డు నెలకొల్పింది.

కేజీఎఫ్​ 2
KGF Chapter 2
author img

By

Published : Jul 16, 2021, 5:26 PM IST

యావ‌త్ సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2' (KGF chapter 2). పాన్ ఇండియా స్థాయిలో యశ్ (yash) క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే య‌శ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ (KGF chapter 2 teaser record) స‌రికొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్​లో 200 మిలియన్ల వీక్షణలు సాధించి దుమ్మురేపుతోంది. అలాగే ఈ టీజర్​ ఇప్పటివరకు 8.4 మిలియన్ లైక్స్ రాగా 1.1 మిలియన్ కామెంట్స్ వచ్చాయని తెలిపింది చిత్రబృందం.

థియేటర్లలో ఎప్పుడంటే..

అన్నీ సవ్యంగా ఉంటే నేడు (జులై 16) కేజీఎఫ్ 2 థియేటర్లలో విడుదలయ్యేది. కరోనా మొదటి దశ ప్రభావం తగ్గాక ఈ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. కానీ మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభించడం వల్ల థియేటర్లు తెరుచుకోలేని పరిస్థతి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

య‌శ్‌- ప్ర‌శాంత్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన 'కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1' అఖండ విజయం అందుకోవ‌డం వల్ల ఈ సీక్వెల్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో య‌శ్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ర‌వి బ‌ర్సూర్ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: బెడ్​పై కూర్చొని ఒయ్యారం ఒలకబోస్తుంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.