హాట్ బ్యూటీ సన్నీ లియోనీని కేరళ కోచి పోలీసులు శుక్రవారం రాత్రి విచారించారు. చీటింగ్ కేసు విషయమై ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా ప్రస్తుతం సన్నీ కేరళలో ఉంది.
ఇంతకీ ఏం జరిగింది?
కేరళకు చెందిన ఓ ఈవెంట్ సంస్థతో సన్నీ లియోనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 నుంచి ఆ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందుకోసం రూ.29 లక్షలు ఆమెకు ఇచ్చారు. కానీ కొన్నాళ్ల తర్వాత తమ ఈవెంట్లలో సన్నీ పాల్గొనట్లేదని సదరు సంస్థ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే నటిని ఇప్పుడు పోలీసులు విచారించారు.
ఇది చదవండి: డిగ్రీ అడ్మిషన్ లిస్ట్‌లో టాపర్‌గా సన్నీ లియోనీ