ఎలా నటించామో అంటూ సెట్‌లో ఒకటికి రెండుసార్లు చూసుకుంటుంటారు తారలు. మానిటర్ తెచ్చిన వెసులుబాటు అది. తొలినాళ్లలో ఈ సౌలభ్యం ఉండేది కాదు. కెమెరా ముందు నటించడం వరకే తారల పని. ఎలా నటించామనేది, ప్రేక్షకులతో పాటుగా తెరపై చూసి తెలుసుకోవల్సిందే. కాలక్రమంలో సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సెట్లోకి మానిటర్ వచ్చేసింది. సన్నివేశం పూర్తవ్వగానే దర్శకుడి దగ్గరికి వచ్చి ఎలా నటించామనేది చూసుకుంటుంటారు.
ఒకొక్కసారి దర్శకులకి నచ్చినా... తారలకి నచ్చలేదంటే ‘వన్‌మోర్ టేక్’ అంటూ మళ్లీ వెళ్లి నటించి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానిటర్ చూసుకోకుండా నటించడం అంటే అరుదైన విషయమే. కీర్తి సురేశ్ గుడ్‌లక్ సఖి కోసం ఆ ప్రయత్నం చేసిందట. దర్శకుడు నగేష్ కుకునూర్ సలహాతో కీర్తిసురేష్ మానిటర్ చూసుకోలేదట. నటించడం వరకే ఆమె పని. ఈ సినిమా కోసం ఆమె మేకప్ కూడా వేసుకోలేదు. పాత్రలో సహజత్వం కోసమే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. షూటింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగానటించిన ఈ చిత్రాన్ని సుధీర్‌చంద్ర పాదిరి, శ్రావ్యవర్మ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి 'పుథమ్ పుదు కాలై' ట్రైలర్ విడుదల