రణ్వీర్ సింగ్ హీరోగా 'సింబా'ను తెరకెక్కించి హిట్ కొట్టాడు రోహిత్ శెట్టి. గతేడాది విడుదలైన ఈ చిత్రం.. పోలీసు పాత్రకున్న పవర్ ఏంటో మరోసారి నిరూపించింది. ఆ వెంటనే పోలీసు కథతోనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడీ దర్శకుడు. అక్షయ్ కుమార్‌ను కథానాయకుడిగా ఖరారు చేశారు. తాజాగా కత్రినా కైఫ్‌ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ట్విట్టర్లో తెలిపాడీ కిలాడీ హీరో.
రోహిత్ శెట్టి.. పోలీసు కథలతో అజయ్ దేవ్‌గణ్ హీరోగా సింగం సిరీస్, రణ్వీర్తో సింబాను తెరకెక్కించాడు.
అక్షయ్ కుమార్‌తో కత్రినా చాలా కాలం తర్వాత కలిసి నటిస్తోంది. ఇంతకు ముందు 'హమ్కో దివానా కర్ గయే', 'నమస్తే లండన్', 'వెల్కమ్', 'సింగ్ ఈజ్ కింగ్' , 'దే దనా దన్' , 'తీస్ మార్ ఖాన్' చిత్రాల్లో కలిసి నటించారు.
ఇది చదవండి: సింబా దర్శకుడితో ఫరాఖాన్...