లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ దర్శకులు రొమన్ పొలన్‌స్కీ, ఉడ్ అలెన్‌తో గతంలో కలిసి పనిచేసినందుకు చింతిస్తున్నానని చెప్పింది 'టైటానిక్' ఫేమ్ కేట్ విన్స్లెట్. ఇంతకాలం నుంచి వారు గొప్ప దర్శకులుగా మర్యాద పొందడం అవమానకరమని చెప్పింది. వారి చెత్త చరిత్ర తెలియక, వాళ్ల సినిమాల్లో నటించి తప్పు చేసినట్టుగా భావిస్తున్నట్లు వెల్లడించింది. పొలన్స్కితో దర్శకత్వంలో 'కార్నేజ్'(2011), అలెన్ దర్శకత్వంలో 'వండర్ వీల్'(2017) సినిమాల్లో నటించింది కేట్.
గతంలో పీజర్ జాక్సన్ దర్శకత్వంలో 'హెవెన్లీ క్రియేటర్స్' చిత్రంలో నటించిన సమయంలో తాను లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది కేట్. ఓ సన్నివేశంలో నగ్నంగా నటించే సందర్భంలో ఇది జరిగినట్లు తెలిపింది.
ఇదీ చూడండి కేట్.. నిన్ను చూస్తే పెరుగుతుంది హార్ట్ బీట్