ETV Bharat / sitara

kartik Aaryan: మరో సినిమా నుంచి తప్పుకున్న బాలీవుడ్​ హీరో! - కరణ్​ జోహార్​ దోస్తానా 2

బాలీవుడ్​ హీరో కార్తిక్​ ఆర్యన్(kartik aaryan).. ప్రస్తుతం మరో చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'దోస్తానా 2' సినిమా నుంచి తప్పుకున్న ఆయన.. ఇప్పుడు షారుక్​ ఖాన్​(shahrukh khan) నిర్మాణసంస్థ రెడ్​ చిల్లీస్​ నిర్మించే ఓ ప్రేమకథ చిత్రం నుంచి వైదొలగాడు. అయితే ఈ రెండింటికీ సృజనాత్మక వ్యత్యాసమే కారణమని తెలుస్తోంది.

Kartik Aaryan voluntarily exits Shah Rukh Khan's production venture
kartik Aaryan: మరో సినిమా నుంచి తప్పుకున్న బాలీవుడ్​ హీరో!
author img

By

Published : May 27, 2021, 4:18 PM IST

Updated : May 27, 2021, 4:51 PM IST

రెడ్​ చిల్లీస్​ నిర్మిస్తున్న ఓ ప్రేమకథా చిత్రం నుంచి బాలీవుడ్​ హీరో కార్తిక్​ ఆర్యన్​(kartik aaryan) స్వచ్ఛంగా వైదొలగాడు. ఈ సినిమా కోసం ముందుగా తీసుకొన్న పారితోషకాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు. సృజనాత్మక వ్యత్యాసం కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి కార్తిక్​ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు అజయ్​ భల్​​ చెప్పిన కథకు హీరో అసంతృప్తిగా ఉన్నాడని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్​ చిల్లీస్​ నిర్మాణసంస్థ ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ, ఈ ఏడాది చివర్లో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్మాణసంస్థ భావించింది.

దోస్తానా 2 కూడా..

అదే విధంగా ఈ ఏడాది ప్రారంభంలో మరో నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దోస్తానా2' చిత్రం నుంచి కార్తిక్​ ఆర్యన్​ తప్పుకున్నాడు. 2019 నవంబర్లో‌నే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఇటీవలే ఈ చిత్రకథకు సంబంధించి హీరో కార్తీక్‌ కొన్ని మార్పులు చేయాలని సూచించారట. అందుకు నిర్మాత కరణ్‌జోహార్‌(karan johar) కూడా అంగీకారం తెలిపారట. కానీ కార్తిక్‌ కాల్షీట్స్ సరిగ్గా కేటాయించకపోవడం వల్ల అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ, వారిద్దరి మధ్య భేదాభిప్రాయాల(dostana 2 controversy) వల్లే ఈ చిత్రం నుంచి కార్తిక్​ ఆర్యన్​ తప్పించినట్లు బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

కార్తిక్​ ఆర్యన్.. ప్రస్తుతం 'భూల్​ భూలైయా 2'(bhool bhulaiyaa 2 cast)లో కియారా అడ్వాణీతో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో సినిమాకూ సంతకం చేశాడు. కార్తిక్ హీరోగా రోనీ స్క్రూవాలా నిర్మించిన 'ధమాకా'(dhamaka netflix) సినిమా నెట్​ఫ్లిక్స్​ ఓటీటీ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: ఈసారి క్రికెటర్​గా కార్తిక్​ ఆర్యన్!

Last Updated : May 27, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.