బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్ వరుస సినిమాల్లో నటిస్తూ జోరు మీదున్నాడు. ఇప్పుడు మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
ఇప్పటికే హారర్ కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో ఈసారి క్రికెట్ కథాంశాన్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇది ఎవరి బయోపిక్ కాదు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్.. ధర్మ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపొందనుందట. 'గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్' దర్శకుడు శరన్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ను ఎంపిక చేసే ప్రక్రియలో చిత్రబృందం ఉందని వినికిడి. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది
ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్... 'ధమాకా', 'భూల్ భులయ్యా 2', 'దోస్తానా 2', 'ఫ్రెడ్డీ' సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి: కార్తిక్ ఆర్యన్‌తో కత్రినా కైఫ్ రొమాన్స్?