జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా కలయికలో 2008లో ఘన విజయమైన చిత్రం దోస్తానా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ జంటగా నటించనున్నారు. కరణ్‌జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఓ అపార్ట్మెంట్లో అద్దేకు ఉండేందుకు స్వలింగ సంపర్కులుగా నటించే ఇద్దరి యువకులపై హాస్యబరితంగా సాగుతుంది మొదటి చిత్రం. ప్రస్తుతం సీక్వెల్లో కొలిన్ డి కున్హా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కార్తీక్‌తో పాటు మరో కొత్త హీరో ఈ సినిమాలో నటించనున్నాడు.
"కార్తీక్, జాన్వీ కపూర్లతో దోస్తానా సీక్వెల్ తీసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ధర్మా ప్రొడక్షన్స్‌లో కార్తీక్ తొలిసారి నటించనున్నాడు. మరో కొత్త హీరోను ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నా" -కరణ్ జోహార్, బాలీవుడ్ దర్శక నిర్మాత.
శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్లో ధడక్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. ప్రస్తుతం తఖ్త్ అనే చిత్రంలో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ 'ప్యార్ కా పంచనామా' అనే సినిమాతో చిత్రసీమకు పరిచయమయ్యాడు. ఇంతియాజ్ అలీ తీయబోయే చిత్రంలోనూ కార్తీకే హీరో.