తమ సినిమా 'చావు కబురు చల్లగా' చూసిన తర్వాత ప్రజలు, జీవితాన్ని చూసే విధానం మారుతుందని యువహీరో కార్తికేయ అభిప్రాయపడ్డారు. మార్చి 19న థియేటర్లలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
*స్క్రిప్ట్ చెబుతూ నాకు టైటిల్ చెప్పారు. అరే ఈ కథకు భలే టైటిల్ దొరికింది కదా అని అప్పుడే అనుకున్నాను. మా సినిమాలో చెప్పిన ఫిలాసపీకీ ఇదే ఫర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది.
*గీతా ఆర్ట్స్‌లో ఓకే అయిన తర్వాతే దర్శకుడు కౌశిక్ నా దగ్గరకు వచ్చారు. కథ విన్న తర్వాత పెద్ద నిర్మాణ సంస్థ, ఇతరత్రా విషయాలు ఆలోచించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు.
*హీరోయిన్ లావణ్యతో కలిసి నటించడం మంచి అనుభవం. నేను, కౌశిక్‌తో పాటు ఆమె కూడా పూర్తిగా నమ్మి ఈ సినిమా చేసింది. తన తొలి చిత్రంలానే కష్టపడింది. మంచి ఔట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం.
*బతుకును, చావును ఎలా చూస్తున్నాం. జీవితంలో కొన్ని కోల్పోతే, ఏదో జరిగిపోయినట్లు ఎందుకు బాధపడుతున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రజలు, జీవితాన్ని చూసే విధానం మారుతుందని అనుకుంటున్నాను.
*నాతో పాటు చాలామందికి అల్లు అర్జున్ స్పూర్తి. 'గంగోత్రి' నుంచి అల వైకుంఠపురములో' వరకు డ్యాన్స్, స్టైల్ విషయంలో చాలా కొత్తగా ప్రయత్నించారు. ఈ విషయాలన్ని చూసిన తర్వాతే, సర్ నేను మీతో వీటి గురించి మాట్లాడాలని అనుకుంటున్నట్లు ఆయనతో చెప్పాను.
*'ఆర్ఎక్స్ 100'లో మోటర్ సైకిల్, 'గ్యాంగ్‌లీడర్'లో అంబులెన్స్, ఇందులో స్వర్గపురి వాహనం ఉండటం.. ఇవన్నీ అనుకోకుండానే జరిగాయి. ఇకపై నిర్మాతలు నాతో సినిమా అంటే ఏదైనా ఓ బండి పెడతారేమో(నవ్వుతూ)
*దర్శకుడు సుకుమార్.. నన్ను 'ఆర్ఎక్స్ 100' తర్వాత నుంచే అభినందిస్తూవస్తున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి కూడా నా గురించి చాలా చెప్పారు. 'నిన్ను దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాస్తున్నాను. మా ప్రొడక్షన్ 'సుకుమార్ రైటింగ్స్'లో చేయాలి' అని ఆయన నాతో అన్నారు. సుకుమార్ నుంచి కాల్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ కథేంటి అని వినడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">