'కార్తికేయ'తో ఓ కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు దర్శకుడు చందు మొండేటి. నిఖిల్ హీరోగా నటించిన ఆ చిత్రంయ విజయం సాధించింది. అందులో జంతువుల హిప్నాటిజం నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా, ఈసారి శ్రీకృష్ణుడి చుట్టూ అల్లుకున్న కథాంశంతో 'కార్తికేయ2'ను తెరకెక్కిస్తున్నారు చందు.
ఈ సినిమా షూటింగ్ డిసెంబరులో మొదలు కానుంది. ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉంది చిత్రబృందం. "విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. అరుదైన లొకేషన్లలో చిత్రాన్ని తెరకెక్కిస్తాం" అని సినీ వర్గాలు చెప్పాయి.
