కార్తీ, జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దొంగ'. 'దృశ్యం' ఫేం జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రియల్ లైఫ్‌లో వదినా మరిది అయిన కార్తీ జ్యోతికలు రీల్ లైఫ్‌లో అక్కా తమ్ముళ్లుగా ఎలా నటించారో ఈటీవీ భారత్ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఇదీ కథ:
విక్కీ(కార్తీ) ఓ అనాథ. గోవాలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జాలీగా గడుపుతుంటాడు. ఒక రోజు పోలీసులకు చిక్కుతాడు. వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తమిళనాడులోని ఓ ఎమ్మెల్యే(సత్యరాజ్ ) ఇంటికి 15 ఏళ్ల కిందట తప్పిపోయిన కొడుకు శర్వాను నేనని వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్లిన కార్తీకి ఎలాంటి అనుభవం ఎదురైంది. తమ్ముడిని దూరం చేసుకున్న పార్వతి(జ్యోతిక) కార్తీని తమ్ముడిగా అంగీకరించిందా? తప్పిపోయిన శర్వా ఏమయ్యాడు? అనేదే దొంగ కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా ఉంది:
ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. మొదటి నుంచి శుభం కార్డు పడే వరకు ప్రేక్షకులకు ఊహించని మలుపులు ఎదురవుతూనే ఉంటాయి. శర్వాగా వెళ్లిన కార్తీ దొరికిపోతాడా? శర్వ ఏమయ్యాడనే ప్రశ్నలు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటాయి. ఫస్టాఫ్ విక్కీ పరిచయం, ఎమ్మెల్యే ఇంట్లోకి శర్వాగా చేరడం, కోపంతో ఉండే అక్క జ్యోతికకు దగ్గరవడం, శర్వాను ప్రేమించిన అమ్మాయి సంజనతో ప్రేమ వ్యవహారం, పోలీసులతో ఎమ్మెల్యే రహస్య ఒప్పందంతో కథలో అడుగడుగున ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. రెండో భాగంలో శర్వాగా సత్యరాజ్ రాజకీయ వారసుడిగా అడుగుపెట్టిన విక్కీలో ఎలాంటి మార్పు వచ్చింది, ఆ ఇంటి మనుషులు చూపించిన ప్రేమకు నిజం చెప్పి వెళ్లిపోదామనుకులోగా విక్కీపై దాడి జరుగుతుంది. ఆ దాడి ఎవరు చేశారని ఆరా తీస్తున్న క్రమంలో శర్వాకు సంబంధించి విక్కీకి అసలు నిజాలు తెలుస్తాయి. విక్కీ ఏం చేశాడు, పార్వతి విక్కీని ఏం చేసిందనే చిక్కుముడులను విప్పుతూ సస్పెన్స్ రివీల్ కావడం వల్ల దొంగ కథ ముగుస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరెలా చేశారు
ఈ మూవీలో నటినటుల కంటే ముందు చెప్పుకోవాల్సింది దర్శకుడు జీతూ జోసెఫ్ టాలెంట్ గురించి. ఒక కుటుంబంలో జరిగిన సంఘటన ఎలాంటి మలుపులు తిరిగిందో ఆద్యంతం సస్పెన్స్ కలిగిస్తూ ప్రేక్షకుడ్ని చివరి వరకు సీట్లో కూర్చోబెట్టాడు. దృశ్యం తర్వాత అదే స్థాయిలో సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. తన టాలెంట్ ఏంటో మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇక ఈ థ్రిల్లర్ లో విక్కీగా, శర్వాగా రెండు కోణాల్లో కనిపిస్తూ కార్తీ కూడా తానేం తక్కువ తినలేదు అనేలా నటించాడు. తన సహజ నటనతో మెప్పించాడు. శర్వ అక్క పాత్రలో నటించిన జ్యోతిక క్యారెక్టర్ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. అలాగే వీరిద్దరికి తండ్రిగా నటించిన సత్యరాజ్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెస్మరైజ్ చేశాడు. హీరోయిన్ పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. ఇలా ఈ చిత్రంలో కనిపించే ప్రతి పాత్ర ఎక్కడా వేస్ట్ అవకుండా కథను నడిపిస్తాయి. ఇలాంటి థ్రిల్లర్ జోనర్‌కు మ్యూజిక్ కూడా పెద్ద బలమే. నేపథ్య సంగీతం కూడా బాగుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బలాలు :
కథ, కార్తీ, జ్యోతిక, సత్యరాజ్ , క్లైమ్యాక్స్
బలహీనతలు :
ఫస్టాప్ ఎక్కువ సేపు కొనసాగించడం
చివరగా: ఊహించని మలుపులతో ఆకట్టుకున్న దొంగ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
ఇవీ చూడండి.. టాలీవుడ్ 'మన్మథుడు'కి పదిహేడేళ్లు