బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే మాతృత్వం గురించి తన అనుభవాలను పంచుకుంటూ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. 'ప్రెగ్నెన్సీ బైబిల్'(pregnancy bible) అనే టైటిల్‌తో రిలీజ్ అయిన ఈ బుక్‌లో ఇద్దరు పిల్లలకు తల్లి కావడం గురించి, ఆ కాలంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించింది. ఇందులో భాగంగా ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేసే విషయమై మాట్లాడింది.
"గర్భదారణ సమయంలో స్త్రీలకు భర్త సపోర్ట్ చాలా ముఖ్యం. ఆ సమయంలో మహిళల శారీరక, మానసిక స్థితికి అనుగుణంగా అతను నడుచుకోవాలి. ఆమె నుంచి హాట్నెస్ కోరుకోకూడదు. సెక్స్ చేయాలని ఒత్తిడి చేయకూడదు. ఆడవారి నిర్ణయాలకు, ఇష్టాలకు గౌరవ్వం ఇవ్వాలి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు శృంగారంపై ఆసక్తి కోల్పోయా. నా శరీరం ఏ పనికి సహకరించేది కాదు. చాలా కష్టంగా ఉండేది. ఏడో నెలలో ఉన్నప్పుడు ఉదయం బెడ్ మీద నుంచి లేవలేకపోయేదాన్ని. కానీ దాన్ని అర్ధంచేసుకుని సైఫ్ చాలా మద్దతు ఇచ్చేవాడు. కొన్నిసార్లు ఈ పొట్టమీద హాట్‌గా కనిపించేదానిని. ఈ విషయాన్నే సైఫ్‌తో చెప్పేదాన్ని. అతడు కూడా 'నాతో నువ్వు చాలా అందంగా ఉన్నావని' అనేవాడు."
-కరీనా కపూర్, హీరోయిన్.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చింది కరీన. తనకు రెండుసార్లు ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురైన మానసిక, శారీరకంగా ఎదురైన సమస్యలను 'ప్రెగ్నెన్సీ బైబిల్'లో వివరించింది. దానిని జులై 9న విడుదల చేసింది. ఇది తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమీర్‌ఖాన్‌తో 'లాల్ సింగ్ చద్ధా' సినిమాలో నటిస్తోందీ నటి.
ఇదీ చూడండి: పిల్లాడికి.. డైపర్ తొడగలేకపోయిన కరీన!