బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ విజయవంతంగా సాగుతోంది. అయితే మాజీ ప్రియుడు, హీరో షాహిద్ కపూర్‌తో విడిపోయి.. సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్నాక తన జీవితం ఎలా మారింది? సైఫ్‌తో ఎప్పుడు ప్రేమలో పడింది? తమ పెళ్లి విషయం తెలియగానే సన్నిహితులు ఏమన్నారు? సహా పలు విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ బెబో.
"షాహిద్‌తో విడిపోయాక నేను నటించిన 'జబ్ వి మెట్' చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో సైఫ్‌తో ప్రేమలో పడ్డాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాం. ఇదే విషయాన్ని నా సన్నిహితులతో చెప్పగా.. వారు ఆశ్చర్యపోయారు. 'కెరీర్ మంఛి ఫామ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనది కాదు. కెరీర్ నాశనం అవుతుంది' అని చెప్పారు. 'కెరీర్ పోతేనేం ప్రాణం పోదుగా..?. నేను సైఫ్‌ను ప్రేమించాను. అతడితో జీవితం పంచకుంటాను' అని సమాధానమిచ్చాను. వివాహం చేసుకున్నాక కూడా మంచి సినిమాలు చేశాను. సైఫ్ కూడా నన్ను బాగా ప్రోత్సాహించారు."
-కరీనా కపూర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సరసన 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటిస్తోంది కరీనా. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూడండి సినీనటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం