ETV Bharat / sitara

సైఫ్​ ప్రేమను రెండుసార్లు తిరస్కరించిన కరీనా​! - sara Ali khan

అమితాబ్​- జయా బచ్చన్​ నుంచి రణ్​వీర్​-దీపిక వరకు ఎంతో మంది రీల్​లైఫ్​ స్టార్​ కపుల్స్​.. రియల్​ లైఫ్​లోనూ విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఆ కోవకు చెందిన వారే సైఫ్​-కరీనా​. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది? అందుకు సాక్ష్యం ఎవరు? తదితర ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

Kareena Kapoor Khan rejected Saif Ali Khan's proposal TWICE? Here's their love story
సైఫ్​ ప్రేమను కరీనా రెండుసార్లు తిరస్కరించిందట​!
author img

By

Published : Jun 5, 2020, 8:16 AM IST

Updated : Jun 5, 2020, 7:02 PM IST

బాలీవుడ్​లో స్టార్ జోడీల్లో సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్​లది ఒకటి. అయితే వీరి ప్రేమకథలోనూ సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. సైఫ్ కరీనాకు ప్రపోజ్ చేయగా, రెండుసార్లు ఇతడిని తిరస్కరించిందీ భామ. ఆ తర్వాతే ఒప్పుకుంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన మొదట వ్యక్తి అక్షయ్ కుమార్. తమ వ్యవహారం గురించి తెలిసినా, ఈ విషయాన్ని అక్కీ రహస్యంగా ఉంచాడని చెప్పిన కరీనా.. అతడు తనకు మంచి స్నేహితుడని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Kareena Kapoor Khan rejected Saif Ali Khan's proposal TWICE? Here's their love story
సైఫ్​ అలీ ఖాన్​, కరీనా కపూర్

"తాషాన్​' సినిమా చేస్తున్నప్పటి నుంచి సైఫ్​ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం అక్షయ్​కు తెలిసినా చాలా రహస్యంగా ఉంచాడు. అతడు నా నిజమైన స్నేహితుడు. సైఫ్​​ నా కెరీర్​లోని అన్ని పరిస్థితుల్లో మద్దతుగా నిలిచాడు. కెరీర్​ ప్రారంభంలో ఏడాది పాటు అవకాశాలు వచ్చాయి.. మంచి సినిమాలు చేశాను. కానీ, సంవత్సరం తర్వాత ఛాన్స్​లు తగ్గిపోయాయి. అంతటితో నా కెరీర్​ ముగిసిపోయిందని అనుకున్నా. అదే సమయంలో నన్ను జీరో సైజ్​కు మారమని సలహా ఇచ్చాడు సైఫ్​. అలా నా కెరీర్​ తోడ్పాటు అందించాడు"

- కరీనా కపూర్​, బాలీవుడ్​ నటి

సైఫ్-కరీనా గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం

1) 'తాషాన్​' సినిమా షూటింగ్​ జరిగే సమయంలోనే సైఫ్​ అలీఖాన్​పై మనసు పారేసుకున్నట్లు కరీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

2) తన మోచేతిపై కరీనా పేరు పచ్చబొట్టు వేయించుకుని సైఫ్​ అలీఖాన్ అప్పట్లో వార్తల్లో నిలిచారు​.

3) ఆ తర్వాత వారిద్దరూ కలిసి సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కరీనా. "తనతో జీవితాంతం కలిసుండాలని నిశ్చయించుకున్నా. మేమిద్దరం సహజీవనం చేస్తాం" అని​ కరీనా తల్లిని సైఫ్ అడగ్గా.. దానికి ఆమె అంగీకరించింది.

4) బాలీవుడ్​ నిర్మాత కరణ్​ జోహార్​ నిర్వహిస్తున్న 'కాఫీ విత్​ కరణ్​' కార్యక్రమం నాలుగో సీజన్​లోని ఓ ఎపిసోడ్​లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్​లో సైఫ్-కరీనా కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని అభిమానులు చర్చించుకున్నారు.

5) సహజీవనం చేస్తున్న సమయంలో వీరిద్దరూ పారిస్​కు విహారయాత్రకు వెళ్లగా, ఆ సమయంలో కరీనాతో సైఫ్​ తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పారు. అప్పటికే రెండు సార్లు దీనిని తిరస్కరించిన ఈ భామ.. మూడోసారి అంగీకరించింది. తొలిసారి బార్​లో, రెండోసారి నోట్రే డామే చర్చ్​లో సైఫ్​ తన ప్రేమను వ్యక్తపరిచారట.

6)ఆసక్తికర విషయం ఏమిటంటే, 'యాన్​ ఈవెనింగ్​ ఇన్​ పారిస్​' చిత్రీకరణలో భాగంగా సైఫ్​​ తండ్రి మన్సూర్​​ అలీఖాన్​.. సైఫ్ తల్లి షర్మిళా ఠాగూర్​కు పారిస్​లోనే ప్రేమను వ్యక్తం చేశారట. అదే నగరంలో కరీనా.. సైఫ్​ ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత వీరిద్దరికీ వివాహం జరిగింది.

7) ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య 2012 అక్టోబరు 16న సైఫ్-కరీనాల పెళ్లి జరిగింది. ఆ ఏడాది ఎక్కువగా చర్చించుకున్న అంశంగా ఇది నిలిచింది.

8) 2016 డిసెంబరు 20న ఈ జంటకు తైమూర్​ అలీఖాన్​ జన్మించాడు.

ఇదీ చూడండి... మోడల్​ నుంచి కథానాయికగా.. పాత్రేదైనా

Last Updated : Jun 5, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.