రెండో బిడ్డకు జన్మనివ్వడానికి ముందే సినిమా షూటింగ్‌లు పూర్తి చేయాలనే లక్ష్యంతో కరోనా సమయంలోనూ బాలీవుడ్ నటి కరీనా కపూర్ షూటింగ్‌ల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఓ యాడ్‌లో నటిస్తోన్న కరీన సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
షూటింగ్లో పింక్ డ్రెస్‌లో ఉన్న కరీన గర్భంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటో పోస్ట్ చేసిన బాలీవుడ్ భామ..'షూటింగ్ సెట్లో ఇద్దరం ఉన్నాం' అని తన బిడ్డను ఉద్దేశిస్తూ క్యాప్షన్ పెట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ ఫొటోపై స్పందించిన మసాబా గుప్తా.. కరీనా కపూర్‌పై ప్రశంసలు కురిపించింది. కరోనా విపత్కర పరిస్థితుల్ని లెక్కచేయకుండా.. గర్భంతో ఉండీ షూటింగ్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అని పేర్కొంది.
ఇదీ చదవండి:'ఎఫ్ 3' చిత్రంలో మాస్ మహారాజా..!