ETV Bharat / sitara

డ్రగ్స్ కేసు: మీడియా కథనాలను ఖండించిన కరణ్​ - కరణ్ జోహార్​ ట్వీట్​

బాలీవుడ్​ మాదకద్రవ్యాల వ్యవహారంలో తనపై మీడియా చేస్తున్న ఆరోపణలను ఖండించాడు ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​. ఈ క్రమంలోనే ట్విట్టర్​ వేదికగా ఓ పోస్ట్​ చేశాడు.

Karan Johar
కరణ్​ జోహార్​
author img

By

Published : Sep 26, 2020, 2:41 PM IST

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ మరణించినప్పటి నుంచి ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​పై నెటిజన్లు, మీడియా విమర్శలతో విరుచుకుపడుతోంది. కొంతమంది సెలబ్రిటీలూ ఇండస్ట్రీలో నెపోటిజమ్​ తాండవమాడుతోందంటూ ఆరోపణలు చేశారు. కాగా ఇప్పుడు ఎన్​సీబీ దర్యాప్తు చేస్తున్న సంచలనాత్మక మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి.. కరణ్​పై కొద్దిరోజులుగా పలు మీడియా సంస్థలు వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తనపై వస్తున్న మీడియా కథనాలను ఖండిస్తూ.. ట్విట్టర్​ వేదికగా ఓ నోట్​ పోస్ట్​ చేశాడు కరణ్​. ఇందులో గతేడాది తన నివాసంలో నిర్వహించిన వివాదాస్పద పార్టీ గురించి స్పందించాడు. ఆ కార్యక్రమంలో ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని.. వాటిని ప్రోత్సహించడం తన వృత్తి కాదని పేర్కొన్నాడు.

ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్​ ప్రసాద్​, అనుభవ్​ చోప్రాలను ఎన్​సీబీ విచారిస్తుండగా.. వారితో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని కరణ్​ నోట్​లో తెలిపాడు. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే పనులకు తాను బాధ్యత వహించలేనని మీడియా వాదనలను వ్యతిరేకిస్తూ వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.