83 Trailer: టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం '83'. కపిల్‌దేవ్ పాత్రను రణ్‌వీర్‌సింగ్ పోషించారు. కపిల్‌దేవ్ భార్యగా రణ్‌వీర్(Ranveer Singh 83 Trailer) సరసన దీపికా పదుకొణె నటించారు. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ. ట్రైలర్ హిందీ వెర్షన్ మీకోసం' అంటూ రణ్‌వీర్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
ట్రైలర్‌లో అప్పటి ప్రపంచకప్ ఎలా సాగిందో చూపించే ప్రయత్నం చేశారు. మెగా టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆనందక్షణాలను క్లుప్తంగా చూపించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళం, హింది, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 3డీ వెర్షన్‌లోనూ చిత్రం విడుదలవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: