ETV Bharat / sitara

'పుష్ప'లో కన్నడ నటుడు ధనంజయ్‌? - పుష్పలో కన్నడ స్టార్ ధనంజయ్

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో కన్నడ నటుడు ధనంజయ్ ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్
అల్లు అర్జున్
author img

By

Published : Apr 18, 2020, 6:15 AM IST

కుటుంబ కథాచిత్రం 'అల వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్ప'. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని విడుదల చేసి అంచనాలు పెంచేసింది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ నటుడు ధనంజయ్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే అతడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడనే విషయం తెలియదు.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా నటించనున్నాడని వార్తలూ వచ్చాయి. ధనంజయ్‌ గతంలో రామ్‌గోపాల్‌ వర్మ, అభిషేక్‌ నామా నిర్మాతలుగా వ్యవహరించిన కన్నడ చిత్రం 'భైరవగీత'లో కథానాయకుడిగా నటించాడు.

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప'లో పలు భాషలకు చెందిన నటులు నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. రష్మిక మంధాన కథానాయిక. వై.నవీన్, వై.రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.