టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, శాండిల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అదిరిపోయే కాంబినేషన్ కదా. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఎవరైనా ఊహించారా? ఆ ఆసక్తికర ప్రచారమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో, టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పునీత్ అతిథిగా కనిపించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సినిమాకే ప్రధానంగా నిలిచే కీలక మలుపులో ఆయన ఎంట్రీ ఉంటుందని తెలిసింది. అంతేకాదు పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఏది ఏమైనా బాలయ్య-పునీత్ కాంబో అనగానే నెటిజన్లు, అభిమానులు సందడి చేస్తున్నారు.
సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి-బాలయ్య కలిసి పనిచేస్తున్న మూడో చిత్రమిది. ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు బాలకృష్ణ. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.
ఇదీ చూడండి : మరో యంగ్హీరోతో కలిసి నటించనున్న బాలయ్య!