బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజస్'. ఈ సినిమాలో కంగనా రనౌత్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపించనుంది. ఆర్‌ఎస్‌వీపీ ప్రొడెక్షన్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు.. రోనీ స్క్రూవాలా నిర్మాత. తాజాగా క్వీన్ ఫస్ట్‌లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కంగనా ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపించింది.
'తేజస్' సినిమాకు సర్వేశ్ మేవర దర్శకుడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ రూపొందించిన 'ఉరీ: ది సర్టికల్ స్ట్రైక్స్' చిత్రం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'తలైవి' సినిమాలోనూ నటిస్తోంది కంగనా.
ఇదీ చదవండి: దేవరకొండ సెంటిమెంట్ బ్రేక్ అయిందిగా..!