Gehraiyaan kiss kangana: బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఎప్పుడూ ఏదో ఓ విషయమై వివాదాల్లో ఉండనే ఉంటుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'గెహ్రాహియా' సినిమాపైనా పరోక్షంగా స్పందించిన కంగన.. దీపికతో పాటు చిత్రంపై వివాదాస్పద కామెంట్స్ చేసింది. స్కిన్‌షో-అశ్లీలత ఏ సినిమాను కాపాడలేవని రాసుకొచ్చింది.
"నేను నవతరానికి చెందిన మనిషినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ను అర్థం చేసుకోగలను. న్యూ ఏజ్ సినిమా పేరుతో అలాంటి చెత్త సినిమాను రిలీజ్ చేయకండి. బ్యాడ్ సినిమాస్ ఎప్పుడు బ్యాడ్ సినిమాలే. స్కిన్‌షో, అశ్లీలత వాటిని ఏ మాత్రం కాపాడలేవు. ఇది చాలామందికి తెలిసిన విషయం" అని కంగన తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
రొమాన్స్, మోడ్రన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైంది. ఇందులో దీపికతో పాటు సిద్ధాంత్ రొమాన్స్ అంతటా చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: