బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ఆలియా భట్ కుటుంబాల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆలియా సోదరి నటి పూజా భట్.. తన తండ్రి మహేష్ భట్ వెండితెరకు పరిచయం చేసిన సంగతిని కంగనా గుర్తుచేసుకోవాలని సూచించింది. 2006లో విడుదలైన 'గ్యాంగ్‌స్టర్'తో తమ ద్వారానే కంగనా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినట్లు గుర్తుచేసింది. తమపై మాటలతో విరుచుకుపడటం సరికాదని వెల్లడించింది.
అయితే దీనిపై స్పందించిన కంగన సోషల్‌మీడియా టీమ్ మహేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మహేష్.. కంగనాను పిచ్చిదాన్ని చేసి మానసికంగా ఎంతో వేధించాడని ఆరోపించింది. దీంతోపాటు ఆమెపై ఒకానొక సందర్భంలో చెప్పులు కూడా విసిరాడని ట్వీట్ చేసింది.
-
Dear @PoojaB1972, #AnuragBasu had keen eyes to spot Kangana’s talent, everyone knows Mukesh Bhatt does not like to pay artists, to get talented people for free is a favour many studios do on themselves but that doesn’t give your father a license to throw chappals at her...(1/2) https://t.co/5afdsJJx4F
— Team Kangana Ranaut (@KanganaTeam) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear @PoojaB1972, #AnuragBasu had keen eyes to spot Kangana’s talent, everyone knows Mukesh Bhatt does not like to pay artists, to get talented people for free is a favour many studios do on themselves but that doesn’t give your father a license to throw chappals at her...(1/2) https://t.co/5afdsJJx4F
— Team Kangana Ranaut (@KanganaTeam) July 8, 2020Dear @PoojaB1972, #AnuragBasu had keen eyes to spot Kangana’s talent, everyone knows Mukesh Bhatt does not like to pay artists, to get talented people for free is a favour many studios do on themselves but that doesn’t give your father a license to throw chappals at her...(1/2) https://t.co/5afdsJJx4F
— Team Kangana Ranaut (@KanganaTeam) July 8, 2020
కెరీర్ పతనం చేయాలని
నిర్మాత ముకేష్ భట్ కూడా కంగనాను కెరీర్లో ఎదగనివ్వకుండా ఉండేందుకు ప్రయత్నించాడని, పలువురు నటులను కూడా ఇలానే చేశాడని తెలిపింది. చిత్రసీమలో ప్రతిఒక్కరికి ఇది తెలిసిన విషయమేనని వెల్లడించింది.
దీంతో పాటు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్, అతని మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి మధ్య ముకేష్ ఎటువంటి డ్రామా సృష్టించారో తెలపాలని ప్రశ్నించింది? ఇంకా పలు ప్రశ్నలు సంధించి వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది.
త్వరలో కంగన.. అలనాటి తార జయలలిత బయోపిక్‌తో ప్రేక్షకుల మందుకు రానుంది. ప్రస్తుతం 'ధాకడ్' చిత్రంలో నటిస్తోంది.
ఇది చూడండి : బర్త్‌డే గిఫ్ట్‌గా భార్యకు పేపర్‌వెయిట్ ఇచ్చిన అక్షయ్