ETV Bharat / sitara

దీపికా పదుకొణెపై నటి కంగన వ్యంగ్యాస్త్రాలు - డ్రగ్స్​ కేసులో దీపిక పదుకొణె

డ్రగ్స్​ కేసులో తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి దీపికా పదుకొణెపై కంగనా రనౌత్ ట్విట్టర్​లో​ విమర్శలు చేసింది. చిత్రపరిశ్రమలో గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వారంటూ చెప్పుకుని తిరిగే నటులు వాళ్ల మేనేజర్​ను 'మాల్​ ఉందా' అని అడుగుతారని పరోక్షంగా దీపికకు కౌంటర్ ఇచ్చింది.

Kangana Ranaut takes sly dig at Deepika Padukone over alleged drug link
దీపికా పదుకొణెకు నటి కంగన చురకలు
author img

By

Published : Sep 22, 2020, 11:18 AM IST

Updated : Sep 22, 2020, 11:45 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్​ కోణంలో దర్యాప్తు జరుపుతోన్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) రియాతో సహా పలువురు సినీ ప్రముఖులను విచారిస్తోంది. ఈ నేపథ్యంలో నటి రియా కొంతమంది నటీమణుల పేర్లు బయట పెట్టిందంటూ ప్రచారం జరిగింది. అందులో సారా అలీఖాన్​, రకుల్​ ప్రీత్​లతో పాటు దీపికా పదుకొణెపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నటి కంగనా రనౌత్​ ట్విట్టర్​లో దీపిక హ్యాష్​ట్యాగ్​తో వ్యంగంగా స్పందించింది.

"నా తర్వాత ఇలా చేయండి. మానసిక ఒత్తిడి అనేది మాదకద్రవ్యాల వినియోగం తర్వాత పరిణామం. క్లాస్​ నటులు అని, మంచి పెంపకం అని చెప్పుకునే ప్రముఖ నటుల పిల్లలు వాళ్ల మేనేజర్​ను 'మాల్​ ఉందా?' అని అడుగుతారు" అని దీపికా పదుకొణె హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేసింది కంగనా రనౌత్​.

జూన్​ 14న సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మరణం తర్వాత నటి దీపిక మానసిక ఒత్తిడి గురించి పలు ట్వీట్లు చేసింది. నిరాశ అనేది ఒక అనారోగ్యమని.. నిరాశ అనేది మానసిక అనారోగ్యానికి ప్రతిరూపమని సోషల్​మీడియాలో వెల్లడించింది. ఇప్పుడు ఆ ట్వీట్లలో దీపిక ఉపయోగించిన పదాలను వాడుతూ దీపికను విమర్శించింది కంగన. దీపిక, ఆమె మేనేజర్​ కరీష్మా మధ్య జరిగిన వాట్సప్​ చాట్​ అంటూ ఓ టీవీ ఛానల్​ ప్రసారం చేస్తున్న వీడియోను షేర్​ చేసింది కంగన.

విచారణకు శ్రద్ధా, సారా!

బాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా యువ నటీమణులు శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌సింగ్‌ కేసు విచారణలో భాగంగా బయటపడ్డ డ్రగ్స్​ సరఫరా అంశంలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే అతని సన్నిహితురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టు చేసింది. అంతకుముందు మూడు రోజులపాటు రియాను విచారించగా ఆమె పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటపెట్టింది. అందులో శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ వారికి త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Last Updated : Sep 22, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.