బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతికి నెపోటిజమ్ ఓ కారణమని చెప్పిన నటి కంగనా రనౌత్.. ఇప్పుడు మరో అంశాన్ని లేవనెత్తింది. కొన్ని వెబ్సైట్లు పలువురు నటీనటుల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయని వెల్లడించింది. ఫలితంగా వాళ్లు లోలోనే కుమిలిపోతూ బాధపడుతున్నారని తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. తాను గతంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని తెలిపింది.
-
Emotional, psychological & mental lynching •
— Team Kangana Ranaut (@KanganaTeam) June 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
On an individual happens openly and we all are all guilty of watching it silently. Is blaming the system enough? Will there ever be change? Are we going to see a monumental shift in the narrative on how outsiders are treated? pic.twitter.com/DKmR1JhlDV
">Emotional, psychological & mental lynching •
— Team Kangana Ranaut (@KanganaTeam) June 19, 2020
On an individual happens openly and we all are all guilty of watching it silently. Is blaming the system enough? Will there ever be change? Are we going to see a monumental shift in the narrative on how outsiders are treated? pic.twitter.com/DKmR1JhlDVEmotional, psychological & mental lynching •
— Team Kangana Ranaut (@KanganaTeam) June 19, 2020
On an individual happens openly and we all are all guilty of watching it silently. Is blaming the system enough? Will there ever be change? Are we going to see a monumental shift in the narrative on how outsiders are treated? pic.twitter.com/DKmR1JhlDV
"ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా, మానసికంగా ఓ మనిషిపై బహిరంగంగా దాడి జరుగుతుంటే మనం నిశ్శబ్దంగా చూస్తున్నాం. వ్యవస్థను నిందిస్తే సరిపోతుందా? దీనిలో మార్పు ఏమైనా వస్తుందా? బయట నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తుల పట్ల ఎలాంటి వ్యత్యాసం చూపిస్తున్నారో అలాంటి వాటిని ఇంకా భరించలా?" అంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాలీవుడ్ బడాబాబులుగా చలామణి అయ్యే కొందరు పెద్దలు.. పలువురు జర్నలిస్టులతో కుమ్మక్కయ్యారని చెప్పింది కంగనా. వారంతా కొందరిని లక్ష్యంగా చేసుకుని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపింది. 'మణికర్ణిక' విడుదల సమయంలో తనకు అలానే అనుభవమే ఎదురైందని వెల్లడించింది.
ఇవీ చదవండి: