వివిధ కారణాలతో ముంబయిలోని మెట్రోపాలిటన్ కోర్టులో తమపై నమోదైన మూడు క్రిమినల్ కేసుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కంగనా సిస్టర్స్. వాటిని హిమాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ముంబయిలో కేసుల విచారణకు హాజరుకావడం తనకు ప్రాణానికి ముప్పు అని ఈ పిటిషన్లో కంగన పేర్కొంది. శివసేన నేతల నుంచి ప్రాణహాని ఉన్నందున కేసులను తన సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
గతేడాది జులై 19న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి జావేద్ అక్తర్ కూడా ఓ కారణమని పరుష వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆయన.. కంగనపై పరువునష్టం కేసు పెట్టారు. కాగా, రైతుల చట్టాల విషయంలో ఆమె చేసిన ట్వీట్లు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, అల్లర్లను సృష్టించేలా ఉన్నాయని వేరే కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం కంగన 'తలైవి', 'ధాకడ్' సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి ఈ చిత్రాలు.
ఇదీ చూడండి: కంగనా రనౌత్‌పై రోజుకో కేసు.. ఇంటికి సమన్లు!