వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. మరోసారి తన మాటలతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 'జడ్జిమెంటర్ హై క్యా' చిత్రంలోని పాట విడుదల కార్యక్రమంలో ఓ విలేకరితో గొడవ పెట్టుకుంది.
కార్యక్రమంలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "నువ్వు నేను తీసిన 'మణికర్ణిక' సినిమాకు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చావు. సినిమా తీయడంలో నేనేమైనా తప్పు చేశానా" అంటూ అతడిని ఎదురు ప్రశ్నించింది. "నువ్వు నా వానిటీలో నన్ను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేశావు.. ఆ తర్వాత నా మొబైల్‌కు మెసేజ్ చేశావు" అంటూ అతడిపై ఆరోపణలు చేసింది.
తాను అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటూ విలేకరి కంగనాను ప్రశ్నించగా ఈ గొడవ ప్రారంభమైంది. కార్యక్రమంలో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
-
#WATCH Kangana Ranaut has a spat with a reporter, accuses him of smear campaign, at the 'Judgementall Hai Kya' song launch event in Mumbai. (07.07.2019) pic.twitter.com/sNuWduY3yg
— ANI (@ANI) July 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Kangana Ranaut has a spat with a reporter, accuses him of smear campaign, at the 'Judgementall Hai Kya' song launch event in Mumbai. (07.07.2019) pic.twitter.com/sNuWduY3yg
— ANI (@ANI) July 8, 2019#WATCH Kangana Ranaut has a spat with a reporter, accuses him of smear campaign, at the 'Judgementall Hai Kya' song launch event in Mumbai. (07.07.2019) pic.twitter.com/sNuWduY3yg
— ANI (@ANI) July 8, 2019
ఇవీ చూడండి.. అమితాబ్‌ను ఆకట్టుకున్న హైదరాబాదీ సిగ్నలింగ్