బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ట్విట్టర్లో అధికారికంగా చేరినట్లు ప్రకటించింది. ఓ వీడియో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు టీమ్ కంగనా రనౌత్ పేరుతో ఈ ఖాతా నడుస్తుండగా.. ఇప్పుడు ఆ పేరును కంగనా రనౌత్గా మార్చారు. ఈ క్రమంలోనే అభిమానుల మద్దతు కోరుతూ, సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో చేరడానికి గల కారణాలను వెల్లడించింది.
-
This is for my twitter family 🥰🙏 pic.twitter.com/KGdJPPWrQ1
— Kangana Ranaut (@KanganaTeam) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is for my twitter family 🥰🙏 pic.twitter.com/KGdJPPWrQ1
— Kangana Ranaut (@KanganaTeam) August 21, 2020This is for my twitter family 🥰🙏 pic.twitter.com/KGdJPPWrQ1
— Kangana Ranaut (@KanganaTeam) August 21, 2020
"అందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాల నుంచి సినిమాల్లోనే ఉన్నాను. గతంలోనే చాలా మంది నన్ను సోషల్ మీడియాలో చేరాలని ఒత్తిడి చేశారు. కానీ ఇష్టం లేనందున తిరస్కరిస్తూ వచ్చా. ఇందులో నేను లేనందున చాలా మంది నా గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా నాకు చేరాలని అనిపించలేదు. నా అభిమానులకు , నాకు మధ్య ఎప్పుడూ దూరం ఉన్నట్లు భావించలేదు. నేను నటించిన చిత్రాల ద్వారా మహిళా సాధికారతపై అనేక సందేశాలు ఇచ్చాను"
కంగనా రనౌత్, బాలీవుడ్ ప్రముఖ నటి
"ఈ ఏడాది సోషల్ మీడియా పవర్ చూశా. సుశాంత్ కోసం ప్రపంచం మొత్తం ఎలా కలిసి పోరాడిందో గమనించా. కచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఈ చర్యతో నాకు భరోసా లభించినట్లైంది. ట్విట్టర్లో ఖాతా తెరవడానికి కారణం కూడా ఇదే" అని కంగన చెప్పింది. ఈ సరికొత్త ప్రయాణంలో తనకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరింది. నూతన బంధానికి నాందిగా దీనిని పేర్కొంది.