ETV Bharat / sitara

కంగనా రనౌత్​కు వై-ప్లస్​' భద్రత.. కారణమిదే!

author img

By

Published : Sep 7, 2020, 9:45 PM IST

Updated : Sep 8, 2020, 6:37 AM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై- ప్లస్​ కేటగిరీ భద్రత కల్పించింది. దేశంలోనే అతిపెద్ద పారా మిలిటరీ దళమైన సీఆర్​పీఎఫ్​ సిబ్బంది కంగనకు రక్షణగా ఉండనున్నారు. ఈ భద్రత పొందిన వారిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఇందుకోసం డబ్బులేమైనా చెల్లించాలా? వంటి విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Kangana
కంగన

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం 'వై ప్లస్‌' కేటగిరీ భద్రత ఏర్పాటు చేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఇటీవలే కంగన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకంపై తన అభిప్రాయాలు వెల్లడించింది. ఈ మేరకు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పారా మిలిటరీ దళమైన సీఆర్​పీఎఫ్​​​​ భద్రత పొందిన తొలి బాలీవుడ్​ స్టార్ కంగన కావడం విశేషం. అయితే, గతంలో ఎవరెవరికి సీఆర్​పీఎఫ్​ రక్షణ కల్పించారు. ప్రస్తుతం ఈ సేవలను అందుకుంటున్న వారెవరు? వంటి విశేషాలు తెలుసుకుందాం రండి.

రాజకీయ నాయకుల్లో సీఆర్​పీఎఫ్ భద్రత ఉన్న వారెవరు?

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డె, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేతలు రాహుల్​, ప్రియాంకతో సహా సుమారు 60 మంది ప్రముఖులు, ఉన్నత వ్యక్తులకు సీఆర్​పీఎఫ్​ రక్షణ కల్పిస్తోంది.

దీనికి డబ్బులు చెల్లించాలా?

రిలయన్స్​ సంస్థ అధినేత ముఖేశ్​ అంబానీ, అతని భార్య నీతాకు సీఆర్​పీఎఫ్​ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. ముఖేశ్​ జెడ్​-ప్లస్​ కేటగిరీ భద్రతను పొందుతుండగా.. ఆతని భార్యకు వై- ప్లస్​ కేటగిరీ భద్రత లభిస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి పొందే ఈ సెక్యురిటీకి వారు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు కంగనకు ఏర్పాటు చేసిన భద్రతకు ఆమె కూడా చెల్లించాల్సి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఎస్కార్ట్​ వాహనాలు వారికి మాత్రమేనా?

వై- ప్లస్​ కేటగిరీ భద్రత కింద.. రనౌత్​కు 11 మంది సాయుధ కమాండోలను రక్షణగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీరంతా షిఫ్టుల వారీగా పని చేస్తారు. సిబ్బందిలో రోజూ ఇద్దరు, ముగ్గురు వ్యక్తిగత భద్రత అధికారులు రనౌత్​తోనే ఉంటారు. మిగిలిన వారు ఆమె నివాసానికి భద్రత వహిస్తారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయనున్నారు. కాగా కంగన భద్రత బృందం కోసం ఎస్కార్ట్​ వాహనాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జెడ్​-ప్లస్​ కేటగిరీ కలిగిన వ్యక్తికీ ఎస్కార్ట్​​ వాహనాన్ని కేటాయిస్తారని.. ఒక పైలట్​ కూడా ఉంటాడని పేర్కొన్నారు.

ఇతర బాలీవుడ్​ స్టార్స్​ సెక్యురిటీ సంగతేంటి?

ఇతర బాలీవుడ్​ తారలకు ఎక్కువగా మహారాష్ట్ర పోలీసులు, ప్రైవేటు సెక్యురిటీ ఏజెన్సీలు భద్రత కల్పిస్తాయి.

Last Updated : Sep 8, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.