మరోసారి భయపెడుతూ నవ్వించడానికి వస్తున్నాడు లారెన్స్. వరుసగా హర్రర్ సినిమాలతో దుమ్ము రేపుతోన్న ఈ కోలీవుడ్ హీరో 'కాంచన-3' తో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 'ముని' సిరీస్లో నాలుగవ చిత్రంగా రూపొందిందీ సినిమా. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో వేదిక, కోవై సరళ, కబీర్ సింగ్ దుహాన్, సత్యారాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో మే 1 విడుదల చేస్తామని తెలిపినా.. కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.