ETV Bharat / sitara

పెళ్లికి సిద్ధమవుతోన్న హీరో సాయిధరమ్​ తేజ్​! - కాజల్​ పెళ్లి

టాలీవుడ్​ హీరో సాయి ధరమ్​ తేజ్​ హైదారాబాద్​కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. కాగా, హీరోయిన్​ కాజల్​ అగర్వల్​ కూడా ముంబయి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహమాడనుందని తెలిసింది.

saidharam tej
సాయిధరమ్​
author img

By

Published : Oct 6, 2020, 7:51 AM IST

సినీ తారలు ఒకొక్కరూ బ్యాచిలర్‌ జీవితానికి స్వస్తి చెబుతున్నారు. నితిన్‌, రానా, నిఖిల్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి యువ కథానాయకుడు సాయితేజ్‌, హీరోయిన్​ కాజల్‌ అగర్వాల్‌ కూడా చేరబోతున్నారు. సాయితేజ్‌ వివాహం హైదరాబాద్‌కి చెందిన ఓ యువతితో నిశ్చయమైనట్టు సమాచారం. తల్లి విజయ దుర్గ చూసిన అమ్మాయే నచ్చి తేజ్‌ పెళ్లికి పచ్చజెండా ఊపారని తెలిసింది. వచ్చే వేసవిలో ఈయన పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది. త్వరలోనే 'సోలో బ్రతుకే సో బెటర్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సాయి.

అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ కూడా త్వరలోనే పెళ్లి కబురు వినిపించబోతోంది. ముంబయికి చెందిన గౌతమ్‌ అనే యువ వ్యాపారవేత్తని కాజల్‌ వివాహమాడనున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారైందని, లాక్‌డౌన్‌ తర్వాత బాలీవుడ్‌లో జరగబోతున్న పెద్ద వివాహ వేడుక కాజల్‌దేనని బాలీవుడ్‌ సినీ వర్గాలు చెబుతున్నాయి. కాజల్‌కి దక్షిణాదితోపాటు హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. సోమవారం తన ఇన్‌స్టాలో లవ్‌ సింబల్‌ ఉన్న ఓ ఫొటోను కాజల్‌ పంచుకోవడం విశేషం.

ఇదీ చూడండి ఆ సినిమా కోసం కీర్తి మేకప్​ వేసుకోలేదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.