ETV Bharat / sitara

కాజల్​ను కదిలించిన క్యాబ్​ డ్రైవర్ దీనగాధ - coronavirus precautions

కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం వల్ల ఓ సాధారణ క్యాబ్​ డ్రైవర్​కు ఎదురైన పరిస్థితులను ఇన్​స్టా వేదికగా పంచుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.

kajal-shared-an-emotional-real-life-incident
కాజల్​ను కదిలించిన క్యాబ్​ డ్రైవర్ జీవితం
author img

By

Published : Mar 18, 2020, 9:08 AM IST

Updated : Mar 19, 2020, 12:29 AM IST

ప్రముఖ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్.. తన హృదయాన్ని కదిలించిన ఓ నిజ జీవిత సంఘటనను ఇన్‌స్టాలో పంచుకుంది. కరోనాను వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కొందరు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. వైరస్‌ వల్ల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ పడ్డ కష్టాన్ని చూసి, తన గుండె పగిలిందని చెప్పింది. ఈ విషయాన్ని తనకు ఓ స్నేహితురాలు పంపిందని తెలిపింది.

kajal-shared-an-emotional-real-life-incident
కాజల్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ

'ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నా ముందు నిల్చుని ఏడ్చాడు. గత 48 గంటల్లో నేనే తన మొదటి కస్టమర్‌ అని చెప్పాడు. కనీసం ఇవాళ అయినా నేను సరకులు తీసుకెళ్తానని తన భార్య అనుకుంటోందని అన్నాడు. ఈ వైరస్‌ మనల్ని అనేక విధాలుగా దెబ్బతీస్తోంది. కానీ రోజువారి ఆదాయం మీద జీవితం గడిపేవాళ్లు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతడికి రూ.500 ఎక్కువగా ఇచ్చా. మనలోని చాలా మందికి ఇలా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అంతేకాదు తన గత కస్టమర్‌ను వదిలిపెట్టిన తర్వాత దాదాపు 70 కిలోమీటర్లు డ్రైవింగ్‌ చేశానని అతడు చూపించాడు. దయచేసి మీ క్యాబ్ డ్రైవర్లకు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉన్న వారికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే.. ఆరోజుకి మీరే వాళ్ల చివరి కస్టమర్‌ కావొచ్చు' అని రాసి ఉన్న పోస్ట్‌ను కాజల్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

ఇదీ చూడండి.. గాడిద పిల్ల, గుర్రం పిల్లతో టెర్మినేటర్​ హీరో

Last Updated : Mar 19, 2020, 12:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.