ETV Bharat / sitara

గౌతమ్​తో ప్రేమ ఎలా చిగురించిందో కాజల్​ మాటల్లోనే.. - kajal gautam love

ఎనిమిదేళ్ల క్రితం ఓ కామన్​ ఫ్రెండ్ పెళ్లి​లో తన భర్తను తొలిసారి కలిశానని చెప్పిన హీరోయిన్​ కాజల్​.. రెండేళ్ల క్రితం తామిద్దరం ప్రేమలో పడినట్లు తెలిపింది. ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది.

Kajal
కాజల్​
author img

By

Published : Nov 26, 2020, 5:31 AM IST

స్టార్​ హీరోయిన్​ కాజల్​.. అక్టోబర్​ 30న ప్రియుడు గౌతమ్‌ కిచ్లూను మనువాడింది. ప్రస్తుతం.. హానీమూన్​ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ​ భర్తతో కలిసి ప్రతి క్షణాన్ని బాగా ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్​.. గౌతమ్​ను తొలిసారి ఎప్పుడు కలిసిందో తెలిపింది.

"ఎనిమిదేళ్ల క్రితం మా ఇద్దరికి పరిచయమున్న ఓ కామన్ ఫ్రెండ్​ పెళ్లిలో తొలిసారి కలుసుకున్నాం. అప్పటి నుంచి మేమిద్దరం టచ్​లో ఉన్నప్పటికీ తక్కువగానే మాట్లాడుకునే వాళ్లం. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డాం. మా ఇరు కుటుంబాలు మా ప్రేమను ఒప్పుకున్నాయి. అలా లాక్​డౌన్​లో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం."

-కాజల్​, స్టార్​ హీరోయిన్​.

ప్రస్తుతం కాజల్​.. పలు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' షూటింగ్‌లోనూ డిసెంబరు 5 నుంచి పాల్గొననుంది.

ఇదీ చూడండి : హనీమూన్​లో కాజల్ అగర్వాల్ జోడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.