ETV Bharat / sitara

కాజల్​పై బాడీ షేమింగ్ కామెంట్స్​.. నెటిజన్లపై బ్యూటీ ఫైర్​ - kajal aggarwal on body changes during pregnancy

జీవితం, పని ప్రదేశంలో అందరూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంటే ఇంకా మీరు బాడీ షేమింగ్ దగ్గరే ఉండిపోతున్నారని నెటిజన్లపై ప్రముఖ నటి కాజల్ మండిపడింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ గురించి, తనపై వస్తున్న కామెంట్స్​ గురించి పెద్ద పోస్ట్ పెట్టింది.

kajal agarwal
కాజల్ అగర్వాల్
author img

By

Published : Feb 9, 2022, 1:32 PM IST

ప్రెగ్నెన్సీతో ఉన్న హీరోయిన్​ కాజల్ అగర్వాల్.. భర్తతో కలిసి ఇటీవల దుబాయ్​ వెళ్లి వచ్చింది. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, తన శరీరం, ముఖం గురించి పలువురు నెటిజన్లు విపరీత కామెంట్లు చేశారు. దీంతో వారిపై ఫైర్ అయిన కాజల్.. తాను అలాంటి పట్టించుకోనని బదులిచ్చింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది.

"గర్భం వల్ల నా జీవితంతో పాటు శరీరంలో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. వీటిని స్వీకరించడం అలవాటు చేసుకుంటున్నాను. ఈ మార్పులకు అదనంగా నా శరీరంపై కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కామెంట్స్ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇతరుల పట్ల సానుభూతి చూపడం, దయతో ఉండటం కష్టమే. ఆనందంగా ఉందాం. ఎదుటివారిని జీవించనిద్దాం" అని కాజల్ తన సోషల్ మీడియాలో ఖాతాలో రాసుకొచ్చింది.

ఈ ఏడాది జనవరి 1వ తేదీన తాను తల్లిని కాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కాజల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే సినిమాలకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం కాజల్ నటించిన 'ఆచార్య' విడుదలకు సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఇందులో నటించింది. దుల్కర్ సల్మాన్ 'హే సినామిక'​లోనూ హీరోయిన్​గా చేసింది. ఈ చిత్రాలు రెండూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదీ చదవండి: 'తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.