హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal aggarwal husband) త్వరలో ముఖ్యమైన విషయం చెప్పనుంది. ఇన్స్టా స్టోరీలో ఇందుకు సంబంధించిన హింట్ ఒకటి ఇచ్చింది. అది ఏమై ఉంటుందా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.
![kajal aggarwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13292219_kajal11.jpg)
గతేడాది అక్టోబరులో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను(gautam kitchlu kajal aggarwal) పెళ్లి చేసుకున్న కాజల్ ప్రస్తుతం గర్భంతో ఉందని సమాచారం. ఇందుకోసమే 'ఆచార్య'(acharya movie release date) షూటింగ్ త్వరగా పూర్తి చేసి ముంబయి వెళ్లిపోయిందని అంటున్నారు. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరి!
ఈమె తెలుగులో 'ఆచార్య'తో పాటు నాగార్జున 'ది ఘోస్ట్'లో హీరోయిన్గా నటిస్తోంది. 'ఆచార్య' ఈమె పాత్ర చిత్రీకరణ పూర్తయింది. నాగ్ సినిమా నుంచి మాత్రం ఇప్పుడు తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో ఇలియానాను హీరోయిన్గా ఎంపిక చేశారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.
![kajal aggarwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13292219_kajal1.jpg)
ఇవీ చదవండి: