ETV Bharat / sitara

సల్మాన్​తో అదరగొట్టిన స్టార్​... ఇప్పుడు 'సైరా'తో.... - vijay sethupathi

ప్రముఖ బాలీవుడ్​ సంగీత దర్శకుడు జూలియస్ పేకియమ్.. తొలిసారి ఓ దక్షిణాది సినిమాకు పనిచేశాడు. మెగాస్టార్​ చిరంజీవి 'సైరా'కు బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​​ అందించాడు.

సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి
author img

By

Published : Aug 21, 2019, 5:23 PM IST

Updated : Sep 27, 2019, 7:19 PM IST

ఏ సినిమాకైనా సంగీతం ఎంత ప్రాముఖ్యం వహిస్తుందో.. నేపథ్య సంగీతం అంతే ముఖ్యం. అలాంటిది మెగాస్టార్​ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా' కోసమైతే మరింత జాగ్రత్త తీసుకోవాలి. అందుకే బాలీవుడ్​ నుంచి ప్రముఖ బ్యాక్​గ్రౌండ్​ స్పెషలిస్ట్​ జూలియస్ పేకియమ్​ను తీసుకొచ్చారు. హిందీ చిత్రాలతో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ సంగీత దర్శకుడు.. 'సైరా'తో టాలీవుడ్​కు పరిచయమవుతున్నాడు.

Julius Packiam
జూలియస్ పేకియమ్

ఎక్కువగా సల్మాన్​ఖాన్​ చిత్రాలకు నేపథ్య సంగీతమందించి ఆకట్టుకున్నాడు పేకియమ్. ఏక్ థా టైగర్, టైగర్​ జిందా హై, బజరంగీ భాయిజాన్, సుల్తాన్, భారత్, ట్యూబ్​లైట్​తో పాటు మిగతా హీరోలు నటించిన బాఘీ, భాఘీ 2, ధూమ్ 3 చిత్రాల్లో తన ప్రతిభను చూపించాడు. ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సైరా'.. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్​ అలరిస్తోంది. అమితాబ్​ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది సంగీతమందించాడు. రామ్​చరణ్​ నిర్మాత.

ఇది చదవండి: నిజమైన మెగాస్టార్ అమితాబ్​ బచ్చనే: చిరంజీవి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.