ETV Bharat / sitara

ఎన్టీఆర్​ గ్యారేజ్​లో లగ్జరీ కారు.. దేశంలో ఇదే మొదటిది! - లంబోర్ఘిని ఎన్​టీఆర్​

ఎన్టీఆర్​ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దేశంలో లాంబొర్గిని కొత్త మోడల్​ను కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈ విలాసవంతమైన కారు ధర రూ. 3 కోట్ల పైమాటే ఉంటుందని సమాచారం.

jr ntr new car, లంబోర్ఘిని ఎన్​టీఆర్​
ఎన్​టీఆర్​ గ్యారేజ్​లోకి లగ్జరీ కారు
author img

By

Published : Aug 18, 2021, 12:40 PM IST

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​కు కార్లంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన గ్యారేజ్​లో రకరకాల కార్లు దర్శనమిస్తాయి. ఇప్పుడు తాజాగా ఈ గ్యారేజ్​లోకి మరో కారు​ అడుగుపెట్టనుంది. విలాసవంతమైన స్పోర్ట్స్​ కార్లకు కేరాఫ్​ అయిన లాంబొర్గిని (lamborghini urus graphite capsule) కారును తారక్​ ఇటీవల కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ కారు ప్రస్తుతం బెంగళూరులో ఉంది. త్వరలోనే హైదరాబాద్​లోని ఆయన ఇంటికి​ చేరుకుంటుంది.

ఇదే మొదటిది

భారత్​లో లాంబొర్గిని ఉరుస్​ గ్రాఫైట్​ క్యాప్సూల్​ మోడల్​ను కొనుగోలు చేసిన తొలి వ్యక్తి ఎన్టీఆర్​ కావడం విశేషం. ఈ విలాసవంతమైన కారు ధర రూ. 3 కోట్ల పైమాటే.

jr ntr new car, లంబోర్ఘిని ఎన్​టీఆర్​
ఎన్​టీఆర్​ కొనుగోలు చేసిన కొత్త కారు

ప్రస్తుతం తారక్​ 'ఆర్​ఆర్​ఆర్'​తో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్​లో జరుగుతోంది. రామ్​చరణ్​ మరో కథానాయకుడు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇదీ చదవండి : 'చిరుతో సినీ పెద్దల సమావేశం.. నట్టికుమార్ అసహనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.