ETV Bharat / sitara

తారక్​తో సమంత.. ఆ సినిమా కోసం ఐదోసారి! - samantha latest news

ఎన్టీఆర్, సమంత.. ఐదోసారి కలిసి పనిచేయనున్నారని సమాచారం. త్రివిక్రమ్​ సినిమాలో హీరోయిన్​ పాత్ర కోసం ఈమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

jr.ntr with samantha fourth time for trivikram movie
త్రివిక్రమ్ సినిమా కోసం తారక్​తో సమంత!
author img

By

Published : Oct 19, 2020, 9:49 PM IST

ప్రముఖ కథానాయకుడు జూ.ఎన్టీఆర్‌.. 'ఆర్‌ఆర్‌ఆర్'‌ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని, ఓ పాత్ర కోసం ముద్దుగుమ్మ సమంతను ఎంచుకున్నారని సమాచారం.

ఈమెతోపాటు పూజా హెగ్డే, జాన్వీ కపూర్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజమెంతో తెలియాలంటే ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. హారిక అండ్ హాసిని ఎంటర్​టైన్​మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతమందిస్తున్నారు.

ఇప్పటికే సమంత, తారక్​తో కలిసి నాలుగు సినిమాలు చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలన్నింటిలోనూ ఇద్దరేసి హీరోయిన్లు ఉండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.