ETV Bharat / sitara

'జోకర్​' ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​! - జోక్విన్ ఫోనిక్స్​

జోక్విన్ ఫొనిక్స్ హీరోగా టాడ్​ ఫిలిప్స్​ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'జోకర్'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. ఈ సినిమా సూపర్​హిట్​ అవ్వడం వల్ల ప్రస్తుతం దీనికి సీక్వెల్​ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Joker sequel reportedly still in development
'జోకర్​' ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​!
author img

By

Published : May 10, 2021, 7:49 AM IST

'జోకర్' ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించిన చిత్రం. జోక్విన్ ఫోనిక్స్ జోకర్ పాత్రలో నటించిన ఈ సినిమాను టాడ్ ఫిలిప్స్ తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడమే కాదు.. అందరి ప్రశంసలనూ అందుకుంది. అంతేకాదు.. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి.

92వ ఆస్కార్ పురస్కారాల్లో 11 నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజనల్ స్క్రీన్​ప్లే విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో దర్శకుడు టాడ్ ఫిలిప్స్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

"ఫెనోక్స్ మళ్లీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు"అని చెప్పారు. "తొలి చిత్రం ఎంతగా మెప్పించిందో అంతే స్థాయిలో ఉండే కథ సిద్ధమైతే కచ్చితంగా సీక్వెల్ చేస్తాను" అని చెప్పారు ఫిలిప్. ఏది ఏమైనా సీక్వెల్ చేయడానికి సంబంధించిన ఆలోచనలు సాగుతున్నాయనేది మాత్రం వాస్తవం అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు.

ఇదీ చూడండి: గాయని సునీత.. ఈమె పాడితే లోకమే ఆడదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.