ETV Bharat / sitara

బాలీవుడ్​లో బంధుప్రీతి లేదు: జేమీ - జానీ లీవర్ కూతురు జేమీ

ప్రస్తుతం బాలీవుడ్​లో బంధుప్రీతి గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై స్పందించింది ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్ కుమార్తె జేమీ. సినీ పరిశ్రమలో బంధుప్రీతి లాంటిదేమీ లేదని వెల్లడించింది.

జానీ లీవర్
జానీ లీవర్
author img

By

Published : Jul 9, 2020, 10:31 AM IST

Updated : Jul 9, 2020, 10:49 AM IST

బాలీవుడ్‌లో బంధుప్రీతికి ఆస్కారం లేకపోవచ్చని ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్‌ కుమార్తె జేమీ అంటోంది. అయితే కొందరికి కొందరి పట్ల అతి ఇష్టం, అభిమానం ఉండొచ్చేమోనని పేర్కొంది. తానెప్పుడూ ఓ నటుడి కుమార్తెగా ఫీలవ్వలేదని వెల్లడించింది.

"ఒక నటుడి కుమార్తెగా, సినిమా రంగంతో అనుబంధం ఉన్న అమ్మాయిగా నా ప్రయాణం గురించి మాట్లాడొచ్చు. చెప్పేందుకు ఇష్టం లేనప్పటికీ బంధుప్రీతి గురించి మీకు చెబుతున్నా. స్టార్‌ కిడ్స్‌ అందరికీ ఆశ్రిత పక్షపాతం వర్తించదు. నటీనటుల పిల్లలందరికీ ఆ అవకాశం దక్కదు. నా ప్రయాణం సంక్లిష్టంగా ఉంటుంది. బాలీవుడ్‌లో అతి ఇష్టం వంటిది ఉండొచ్చేమో కానీ బంధుప్రీతి ఉందని అనుకోను."

-జేమీ, జానీ లీవర్ కుమార్తె

"మిత్రుల పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు. తెలిసిన కొందరిపై అభిమానం ఉండొచ్చు. మా నాన్న నటనను కేవలం వృత్తిగానే భావించారు. జీవితంగా భావించలేదు. షూటింగ్‌కు వెళ్లి మళ్లీ ఇంటికొచ్చి తన నిజ జీవితం గడిపేవారు. తన కుటుంబం, మిత్రులు, ఆధ్యాత్మికం గురించే పట్టించుకునేవారు. సినిమా స్టార్ల వేడుకలకు వెళ్లేవారు కాదు. మేం ఏ ఒక్క వర్గం వైపో ఉండలేదు. నా తల్లిదండ్రులు ముందు నుంచీ చిత్ర పరిశ్రమకు చెందినవారేమీ కాదు" అని జేమీ పేర్కొంది.

Last Updated : Jul 9, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.