ఎన్టీఆర్ పక్కన స్టెప్పులేయాలని చాలా మంది హీరోయిన్లు ఆశిస్తుంటారు. కొంతమందైతే ఎన్టీఆర్ డ్యాన్స్‌ను మ్యాచ్ చేయడం కష్టమని కూడా చెబుతుంటారు. అలాంటిది ఎన్టీఆర్ స్టెప్పులను చూసి.. అచ్చు దింపేసింది ఓ డ్యాన్స్ జోడీ. వాళ్లు మన దేశానికి చెందిన వారైతే ఓకే అనొచ్చు. కానీ వాళ్లు జపాన్‌కు చెందినవారంటే.. చప్పట్లు మార్మోగించొచ్చు.
ఇటీవలే 'అశోక్' సినిమాలోని 'గోల గోల' పాటకు కవర్ సాంగ్ చేసి..ట్రెండ్ అయిన హీరోమునిరు, అతని సోదరి అశాహి ససాకీతో కలసి మరో కొత్త పాటతో వచ్చారు. ఈ సారి వారు ఎంచుకున్న పాట 'సింహాద్రి' లోని 'చీమ చీమ'. ఎన్టీఆర్ హుషారైన స్టెప్పులు, అంకిత అందాలతో ఆ రోజుల్లో దుమ్ము రేపిన పాటకు జపాన్ జంట వేసిన ఆట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌కు జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే హీరోమునిరు, అశాహి ససాకీ ఎన్టీఆర్ పాటను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">