యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన స్టెప్పులేయాలని చాలా మంది హీరోయిన్లు ఆశిస్తుంటారు. కొంతమందైతే ఎన్టీఆర్ డ్యాన్స్‌ను మ్యాచ్ చేయడం కష్టమని కూడా చెబుతుంటారు. తన మెస్మరైజింగ్ స్టెప్పులకు మన దేశంలోనే కాదు జపాన్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే కాలంలో ఎన్టీఆర్ మాస్ సాంగ్స్‌కు స్టెప్పులేసి టాలీవుడ్, తారక్ అభిమానుల మనసు గెలుచుకుంది ఓ జపనీస్ జంట. ఇప్పుడు మరో అదిరిపోయే ప్రదర్శనతో మళ్లీ మన ముందుకొచ్చింది.
'కంత్రి' సినిమాలోని 'వయస్సునామి' సాంగ్‌కు జపాన్‌కు చెందిన భార్యాభర్తలిద్దరూ ఇంటి పనులు చేస్తూ నవ్విస్తూనే.. తారక్, హన్సికలు వేసిన స్టెప్పులను అచ్చు గుద్దినట్లు దింపేసి ఆశ్చర్యపరిచారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గతంలోనూ ఎన్టీఆర్ నటించిన 'అశోక్' సినిమాలోని 'గోల గోల' పాటకు, 'సింహాద్రి' చిత్రంలోని 'చీమచీమ' సాంగ్‌కు స్టెప్పులేసి నెటిజన్ల ప్రశంసలు అదుకుందీ జంట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">