ETV Bharat / sitara

జాన్వీ 'గుంజన్ సక్సేనా' విడుదల తేదీ ఖరారు

author img

By

Published : Jul 16, 2020, 4:26 PM IST

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' విడుదల తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని జాన్వీ ఇన్​స్టా ద్వారా తెలియజేసింది.

జాన్వీ 'గుంజన్ సక్సేనా' విడుదల తేదీ ఖరారు
జాన్వీ 'గుంజన్ సక్సేనా' విడుదల తేదీ ఖరారు

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ నటించిన 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్' విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లు మూతపడిన కారణంగా ఇప్పటికే నెట్​ఫ్లిక్స్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

"మొట్టమొదటి భారత మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడం గర్వంగా ఉంది. ఆమె జీవితం నాకు స్ఫూర్తిగా నిలిచింది. మీకు కూడా స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నా. 'గుంజన్ సక్సేనా' ఆగస్టు 12న నెట్​ఫ్లిక్స్​లో విడుదలవుతుంది."

-జాన్వీ కపూర్, నటి

ఈ చిత్రానికి శరణ్‌ శర్మ దర్శకత్వం వహించారు. మొదట ఈ సినిమాను చిత్రబృందం మార్చి 13న విడుదల చేయాలనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనా వల్ల అప్పుడు థియేటర్లు మూతపడటం వల్ల విడుదల సాధ్యపడలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.