అంతర్జాతీయ నేరగాళ్ల ఆటలు కట్టించే జేమ్స్‌బాండ్ పాత్రలో నటించిన రోజర్‌మోర్‌కు ఓ అలవాటు ఉండేదట. అదేంటంటే.. అతను ఎక్కడికి వెళ్లినా అక్కడ టవల్స్ దొంగలించి తనతో పాటు తెచ్చేసుకోవటం.
నటుడిగా తన ప్రయాణం మెుదలుపెట్టాక షూటింగ్‌లకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాడట రోజర్‌మోర్. ఆ సమయంలో తనకు కేటాయించిన హోటల్ గదుల నుంచి టవల్స్ తెచ్చేసేవాడట. ఈ పని అతనికెంతో సరదాగా అనిపించేదట.. ఓసారి ఓ బ్రిటీష్ దిన పత్రిక 'టవల్స్ దొంగ రోజర్‌మోర్' పేరుతో ఓ కథనం ప్రచురించింది. ఇక అప్పటినుంచి ఆ అలవాటు మానేశానని చెప్పుకొచ్చాడీ హీరో.
ఓ టీవీ కార్యక్రమంలో ఈ విషయాన్ని పంచుకున్న రోజర్‌మోర్ ఆ టవల్స్ అన్నీ స్విస్‌లోని తన ఇంట్లో భద్రపరిచానని చెప్పాడు.
ఇది సంగతి: డబ్బు అందుకే ముఖ్యం.. రష్మి భావోద్వేగం