సూర్య కీలక పాత్రలో జ్ఞానవేల్ తెరకెక్కించిన కోర్టు రూమ్ డ్రామా 'జై భీమ్'. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు, విమర్శకులనూ మెప్పించింది. సూర్య, లిజోమోల్, మణికంఠన్‌ల నటన హైలైట్‌గా నిలిచింది. జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని అత్యధిక భాగం కోర్టు సన్నివేశాలతో నడుస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మద్రాసు హైకోర్టును రీక్రియేట్ చేసింది. కేవలం 25 రోజుల్లో తీర్చిదిద్దిన సెట్ చూసి, గత కొన్నేళ్లుగా మద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులే ఆశ్చర్యపోయారు.
1995 నాటి కోర్టు వాతావరణాన్ని తెరపై చూపించడానికి ప్రొడక్షన్ డిజైనర్ కె.కదిర్, సినిమాట్రోగ్రాఫర్ ఎస్.ఆర్.కదిర్‌లు ఎంతో కృషి చేశారు. దర్శకుడు త.శె.జ్ఞానవేల్ ఊహలకు ప్రాణం పోశారు. సెట్‌వేసే సమయంలో జస్టిస్ చంద్రు కూడా అక్కడకు వచ్చి సలహాలు ఇచ్చారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: