తమిళ హీరో సూర్య నటించిన కొత్త చిత్రం 'జైభీమ్'(surya jai bhim movie). నవంబరు 2(surya jai bhim movie release date) నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఆయన న్యాయవాది(తొలిసారిగా) పాత్ర పోషించారు. ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఈ చిత్ర విశేషాలను తెలిపారు. ఈ మూవీ కచ్చితంగా ప్రేక్షకుల హృదయానికి తాకుతుందని చెప్పారు.
"చరిత్ర గుర్తించని హీరోలను గుర్తుచేసుకునే సమయం ఇది. ఓ ఆదివాసి మహిళ.. న్యాయం కోసం ఎలా పోరాటం చేసింది. హైకోర్టుకు వరకు ఎలా వెళ్లింది అనేదే ఈ చిత్ర కథ. ఇది సాధరణ కథాంశం కాదు. ప్రజలు లేదా ఓ మనిషి సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలరనేదే ఈ సినిమా ద్వారా చూపించాం. నిజజీవితంలో జరిగిన ఘటనలను చూపిస్తేనే నిజమైన మార్పు రావడానికి సాధ్యమవుతుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రూ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాను. మానవహక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇలాంటి వారి చరిత్ర మరుగున ఉండకూడదు. అందుకే న్యాయవాది పాత్రలో నటించేందుకు అంగీకరించాను. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే కాదు మనసు హత్తుకుంటుంది. ఈ చిత్రం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎటువంటి విమర్శలు చేయలేదు కానీ ఈ చిత్రం కచ్చితంగా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది."
-సూర్య, తమిళ హీరో
ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: squid game web series: స్క్విడ్‌గేమ్‌లో 'ప్లేయర్ 199' మనోడే