బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్.. గతేడాది వచ్చిన 'నోట్‌బుక్' సినిమాతో అరంగేట్రం చేశాడు. అయితే ఈ యువనటుడు అందాల భామ సోనాక్షి సిన్హాతో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా స్పందించాడు ఇక్బాల్.
"ఈ డేటింగ్ వార్త విన్నాక నేను సోనాక్షి నవ్వుకున్నాం. ఎందుకంటే ఇలాంటి వార్త రావడం ఇదే మొదటిసారి. దీనిపై ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నన్ను సోనాక్షిని ఎక్కడైనా చూసి, ఇలాంటి పుకార్లు సృష్టించి ఉండొచ్చు. నేను ఏం చేస్తున్నానో సోనాక్షికి తెలుసు" -జహీర్ ఇక్బాల్, బాలీవుడ్ నటుడు
ఈ వార్త రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాదిలో సల్మాన్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా జహీర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. గతంలోనే జహీర్‌తో సంబంధంపై సోనాక్షి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పింది.
"ఏదైనా విషయం ఉంటే మీకే (మీడియా) చెప్తాను. నేనూ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా. నాకు మనోహరమైన రాజకుమారుడు కావాలి. ఇప్పటివరకు అలాంటి వ్యక్తి కనిపించలేదు. అందుకే ప్రస్తుతం నేను ఏ రిలేషన్‌లోనూ లేను" -సోనాక్షి సిన్హా, బాలీవుడ్ నటి
మొత్తం మీద సోనాక్షిపై ఇలాంటి వార్తలు రావడం వల్ల ఆమె అభిమానులు ఒకింత కోపంతో ఉన్నారని చెప్పుకుంటున్నారు.
ఇదీ చూడండి : ముద్దుగుమ్మ శ్రియ భర్తకు కరోనా!